Saturday, September 20, 2008

THE RAINBOW...

వినీలాకాశంలో వెండి మబ్బుల సోయగం

పైరగాలి పల్లకిలో చిరుజల్లుల ఆహ్వానం

తొలకరి పలకరింపుతో పుడమితల్లి పరవశం…!
 

ఆ నింగికి ఈ నేలకు కుదిరితే స్నేహం

కనుల ఎదుటే కమనీయ దృశ్యకావ్యం

ప్రకృతికాంత నుదుటిపై హరివిల్లే సింధూరం…!!   
                                                                           --- రమణ