Sunday, November 30, 2008



THE SUNSHINE ...

నిను చూసిన తొలిక్షణం
రవికిరణం తాకిన కుసుమంలా
మదిలో ఎగిసిన చిరుఅలజడి
ఎదలోతుల్లో తియ్యని విరహం రేపింది...!


చంద్రునికే " వెన్నెల " నీవా
సూర్యునికే " వెలుతురు " నీవా
ఊరించే నా "మధుర స్వప్నం " నీవేనా...!


రానా.. విరిజల్లు చినుకై నీకోసం
రానా.. సిరిమువ్వ సవ్వడినై నీమదిలోకి
ఎవరి కోసం నీ ఈ జాబిలి రూపం ...!


తడబాటు తప్పదు మరి నీ ఎడబాటులో
సందేహాల నివృత్తిలో ఎన్నాళ్ళు నా ఈ నిరీక్షణ...!!
---రమణ

No comments:

Post a Comment