
WHO AM I ...
ఊరించే ఆశలకే రెక్కలొస్తే
సువిశాల గగన వీధుల్లో
స్వేచ్చా పావురమై విహరించనా
నింగినేలను ఏకంచేసే రంగుల హరివిల్లునై ...
రోజువారి దినచర్యలో తలమునకలై
అలసిన తనువు మనసుకు
పైరగాలినై సేద తీర్చనా
పసిపాప పెదవిపై తరగని చిరునవ్వునై ...
గర్జించే శ్రావణ మేఘం
తొలకరి చినుకుల వరమిస్తే
పరవశించే పుడమినై పులకరించనా
సెలయేటి గలగలల పలకరింపులతో ...
కష్టాలు కన్నీళ్ళు ఆకలికేకలు
రవ్వంతైనా కరుణించని అదృష్టదేవత
ఈ విదివంచితుల వెతల బ్రతుకుల్లో
కారుచీకటిలో కాంతిరేఖనై వెలుగునింపనా
కుటిల నాయకుల పాలిట సింహ స్వప్న మై ...
కుటిల నాయకుల పాలిట సింహ స్వప్న మై ...
గురుతేలేదు నా నిన్నామొన్నా
ఆనందం అంచున నే నిల్చున్నా
సంతోష సామ్రాజ్య చక్రవర్తినై
చెరగని సంకల్పం తరగని ఆయుధమై ...
Catch me ... who am i !!
--- రమణ
No comments:
Post a Comment