
Feel It ....
జీవితం మధురమైన మకరందం లాంటిది
సీతాకోకచిలుక రెక్కల రంగులు
పసిపాప బోసినవ్వులు
తొలకరి చినుకులు
మట్టివాసన మోసుకొచ్చే గాలులు
పౌర్ణమి జాబిలి వెన్నెల చల్లదనం
నిలాకాశంలో మెరిసే తారల సోయగం
సెలయేటి గలగలలు
గడ్డిపూల పలకరింపులు
తుమ్మెదల సరిగమలు
పక్షుల కిలకిల రావాలు
ఇవన్ని ఆస్వాధించాలన్నా , ఆనంధించాలన్నా
మనిషే కావాలి , మనిషిగా పుట్టి తీరాలి ....!!
.... రమణ
No comments:
Post a Comment